తెలంగాణలో కరోనా ని కట్టడి చేస్తున్నామని అధికారులు అంటున్నారు.  సీఎం కేసీఆర్ తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరగకుండా తగు రీతిలో చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు.  ఎప్పటికప్పుడు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. అయితే ఇక్కడ ఎక్కువగా విదేశీయుల నుంచి.. ఢిల్లీ నిజాముద్దీన్ లో మర్కజ్ ప్రార్థనా మందిరానికి వెళ్లి వచ్చిన వారికే ఈ కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుందని అన్నారు.  తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు ఇవే.  తాజాగా సంగారెడ్డి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు మరోసారి ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది.

 

తాజాగా జహీరాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్దారణ అయింది. ఇతను కూడా ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తే కావడం గమనార్హం.  ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన   ఐదుగురిని గత నెల 31న గాంధీ ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు చేయగా, అందరికీ నెగటివ్ వచ్చింది. వీరందరినీ పరిశీలనలోనే ఉంచిన అధికారులు, తాజాగా మరోసారి పరీక్షలు జరిపారు. దీనిలో ఓ వ్యక్తి శాంపిల్, కరోనా పాజిటివ్ గా వచ్చింది.

 

దీంతో అప్రమత్తమైన అధికారులు, అతనితో సంబంధమున్న 25 మందిని క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 8 కరోనా కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసులు వచ్చిన ప్రాంతాలన్నింటినీ హాట్ స్పాట్ లుగా ఇప్పటికే గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నిషేధించామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఉంటే, మునిసిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, రెడ్ జోన్లను దాటి ఎవరైనా బయటకు వచ్చినా, బయటివారు లోపలికి వెళ్లినా కేసులు పెడతామని హెచ్చరించారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
punjab policemans hand chopped two others injured

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: