ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశం  కరోనా విషయంలో చాలా బెటర్ అని అంటున్నారు.  ఈ విషయంలో ప్రపంచ దేశాలు మన దేశాన్ని పొగుడుతున్నారు.  మన దేశంలో ఆహారం అలవాట్లు.. వండి తినే అలవాట్ల వల్ల కరోనాని కొంత కట్టడి చేయగలుగుతున్నాం.  మన సంస్కృతి, సాంప్రదాయలు కరోనా కట్టడికి ఎంతగానో దోహద పడుతున్నాయి. ప్రస్తుత పద్దతులను పాటిస్తూ ముందుకు వెళితే ఇకపై మనం ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చిరంజీవి అన్నారు. మన ఇంట్లో స్వయంగా చేసుకున్న భోజనం ఎంతో మేలు చేస్తుందని ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి.  ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కి ఇకనైనా స్వస్తి చెప్పాలని అన్నారు.

 

ఇప్పుడు మనం కాలుష్యరహితంగా మారిన వాతావరణంతో జీవితాన్ని ఆస్వాధిస్తున్నాం.  సీసీసీ ఏర్పాటు అనగానే ప్రతి ఒక్కరూ కలిసి వస్తూ కదం తొక్కారు. ఇప్పుడు సినీ కార్మికులు ఆకలి బాధలు లేకుండా ఉన్నారు.  ఇండస్ట్రీలో పెద్దలు, సీనియర్ నటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తరలి వచ్చి తమ వంతు విరాళం అందించారు.

 

తమ్మారెడ్డి భరద్వాజ్, సి. కళ్యాన్, మోహర్ రమేష్, డి.రమేష్, దాము, ఇలా 24 క్రాఫ్ట్ ముందుకు వచ్చి తమ వంతు సాయం అందించారు. కరోనా వైరస్ వల్ల భయపడొద్దు.. అలా అని మొండిగా వాధించవొద్దు.. ఈ వైరస్ చాలా ప్రమాదకరంగా ఉంది.. మన జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష అన్నారు. కరోనా సమయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ద్య కార్మికుల పనితీరు భేష్ అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: