ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 48 కరోనా కేసులు నమోదు కాగా తెలంగాణలో 71 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2719కు చేరగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1991 కు చేరింది. ఏపీలో కరోనా భారీన పడి 57 మంది మృతి చెందగా తెలంగాణలో కూడా 57 మంది మృతి చెందారు. 
 
కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో రికవరీ రేటు పెరుగుతుండటం గమనార్హం. దేశంలోని ఇతర రాష్ట్రాలతో తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొంతమేర నియంత్రణలోనే ఉంది. జాతీయ స్థాయిలో కరోనా రికవరీ రేటు 20 శాతం కాగా తెలుగు రాష్ట్రాల్లో ఆ రేటు అంతకంటే ఎక్కువగా ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కరోనా మరణాల రేటు కూడా తక్కువగా ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: