హైకోర్టులో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఊరట లభించింది. జాతీయ హరిత ట్రైబ్యూనల్ (ఎన్జీటీ) రంగారెడ్డి జిల్లా జన్వాడలోని ఫామ్ హౌస్ పై వివరణ ఇవ్వాలని ఇచ్చిన నోటీసులను హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇస్తూ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. గత కొన్ని రోజులుగా జన్వాడలోని ఫామ్ హౌస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. 
 
కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఫామ్ హౌస్ నిర్మాణం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్జీటీలో కేసు ఫైల్ చేశారు. ఎన్జీటీ ప్రాంతీయ అధికారి నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించగా మంత్రి ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, ఫామ్ హౌస్ తనది కాదని పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: