బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి గతంలో ఏపీ ప్రభుత్వం నియంత్రణ నుంచి తిరుమలను తప్పించాలంటూ గతంలో ఒక పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం గురించి ఏపీ హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు ఆయనకు సూచించింది. తాజాగా ఆయన అదే అంశాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఏపీ హైకోర్టులో తాను వేసిన పిటిషన్ విచారణ చివరి దశలో ఉందంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. 
 
సుబ్రమణ్యస్వామి పిటిషన్ లో తిరుమల ఆలయం, తిరుచానూరు పద్మావతి దేవాలయంతో పాటు మొత్తం పదకొండు ఆలయాలతో దేశంలోనే అత్యంత ధనిక ఆలయమైన తిరుమల ఏపీ ప్రభుత్వం నియంత్రణలో గత రెండు తరాలుగా ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. హిందూ ధార్మిక క్షేత్రాలను 1987 ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని ఆయన కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: