ఈశాన్య ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనాతో  పాటుగా భూకంపాలు కూడా ప్రజలను  బాగా ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా హర్యానాలో భూకంపం సంభవించింది. ఉదయం మిజోరాం లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా హర్యానాలోని కీలక నగరం అయిన రోహాతాక్ లో భూకంపం సంభవించింది. 

 

మధ్యాహ్నం 12:58 గంటలకు హర్యానా రోహ్‌తక్ సమీపంలో 2.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ. దాదాపు ఆరు సెకన్ల పాటు  భూమి కంపించింది అని అధికారులు చెప్తున్నారు. కాగా ఉదయం మిజోరాం లో సంభవించిన భూకంపం లో పలు నివాస గృహాలు ధ్వంశం అయినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక తాజాగా హర్యానా భూకంపం లో మాత్రం ఏ విధమైన ఆస్తి నష్టం జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: