అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ ధాటికి చిగురుటాకులా వణుకుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రెటరీ అలెక్స్ అజర్ చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రజల్ని మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. అలెక్స్ అజర్ తాజాగా మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసే దారులు రోజురోజుకీ మూసుకుపోతున్నాయని వ్యాఖ్యలు చేశారు. 
 
రెండు నెలల కిందటితో పోలిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని... ప్రస్తుతం పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని... ఈ మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు గల దారులన్నీ మూసుకుపోతున్నాయని అన్నారు. 35 ఏళ్లలోపువారే ఎక్కువగా మహమ్మారి బారిన పడుతున్నారని.... చాలా మందికి ఎలాంటి కరోనా లక్షణాలు బయటపడలేదని అన్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: