ప్రస్తుతం భారత ప్రభుత్వం టిక్ టాక్ సహా  చైనాకు  సంబంధించిన 59 మొబైల్ యాప్స్ ని నిషేదించిన  విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో నెటిజన్లు  అందరూ ఆయా యాప్స్ కి  ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. ఇక ప్లే స్టోర్ లో టిక్ టాక్ యాప్ నిషేదించటంతో  చింగారి యాప్ కు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. 

 


 గంటకు లక్ష డౌన్ లోడ్లు అవుతున్నాయి. ఈ విషయాన్ని తాజాగా చింగారి సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా గంటకు 20 లక్షల మంది ఈ యాప్ ని యూస్ చేస్తున్నట్టుగా తాజాగా ఆ సంస్థ వెల్లడించింది, ఈ యాప్ ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషలతో పాటు మరో ఏడు భారతీయ భాషలను కూడా సపోర్ట్ చేస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఎంతో మంది వ్యాపారవేత్తలు సినీ ప్రముఖులు కూడా ఇందులో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: