ఈశాన్య రాష్ట్రాల ప్రజలను వరుస భూకంపాలు ఇబ్బంది పెడుతున్నాయి. వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో అక్కడి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అసోం, నాగాలాండ్, మిజోరాం లో భారీగా భూకంపాలు  పదే పదే వస్తున్నాయి. తాజాగా  మరోసారి భూకంపం సంభవించింది. 

 

ఈ రోజు ఉదయం 8:32 గంటలకు నాగాలాండ్‌లోని లాంగ్లెంగ్ జిల్లాలో 3.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ తీవ్రతకు అక్కడి నివాసాలు స్వల్పంగా దెబ్బ తిన్నాయి అని అధికారులు పేర్కొన్నారు. ఇక ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీసుకున్నారు. అక్కడ ఏ ప్రాణ నష్టం జరగలేదు అని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: