ప్రస్తుతం కరోనా  వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న  నేపథ్యంలో అందరిలో కరోనా  వైరస్ భయమే  కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా సోకకుండానే  ఎంతో మంది మరణిస్తున్నారు కూడా.  తాజాగా ఇలాంటి ఘటనే  వెలుగులోకి వచ్చింది. పిఠాపురం హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా భయంతో  వైద్యుల్లో  కూడా ఎంత భయ ఉంది  అనేదానికి ఈ ఘటన నిదర్శనంగా మారింది. గుంటూరుకు చెందిన బసవ శివ నారాయణ అనే  60 ఏళ్ల వ్యక్తి  మూత్ర సంబంధిత వ్యాధితో అనారోగ్యం బారిన పడడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అయితే వైద్యం చేసేందుకు మాత్రం ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. వృద్ధుడికి కరోనా  వైరస్ ఉందని భావించి కనీసం ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదు. 

 

 గంటల సమయం గడిచిపోతుంది అప్పటికీ సకాలంలో వైద్యం అందించలేదు. దీంతో నిలబడిన  చోటే కుప్పకూలిపోయి చనిపోయాడు బాధితుడు. అయితే భర్త కళ్ళ ముందే చనిపోతున్నప్పుడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్న భార్య భర్త మృతదేహంపై  పడి భోరున విలపించింది. 108 వాహనానికి కాల్ చేసినప్పటికీ కూడా రెండు గంటలైనా రాలేదని.. ఈ క్రమంలో చేసేదేమీ లేక ప్రైవేట్ అంబులెన్స్ లో  జిజిహెచ్ కు తరలించినప్పటికీ  వైద్యుల నిర్లక్ష్యం తన భర్త ప్రాణం తీసింది మృతుడి భార్య ఆరోపణలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: