ఉత్తర భారత మెట్రో సర్వీసుల చరిత్రలో మొట్టమొదటి సారిగా నోయిడా మెట్రో రైల్​ కార్పొరేషన్​(ఎన్​ఎంఆర్​సీ) ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. తన పరిధిలోని 50వ సెక్టారు స్టేషనుకు 'ప్రైడ్​ స్టేషన్​'గా పునఃనామకరణం చేస్తూ హిజ్రాల వర్గానికి అంకితం చేసింది. గౌతం బుద్ధ నగర్​ ఎంపీ మహేష్​శర్మ, నోయిడా శాసనసభ్యుడు పంకజ్​సింగ్​, ఎన్​ఎంఆర్​సీ మేనేజింగ్​ డైరెక్టరు రితు మహేశ్వరిలు నిర్వహించిన కార్యక్రమంలో కొత్త పేరును ఆవిష్కరించారు.


మెట్రో స్టేష​నులో పనుల కోసం ఎన్​ఎంఆర్​సీ నియమించిన ఐదుగురు హిజ్రాలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పశ్చిమ యూపీలోని జంట నగరాలు నోయిడా, గ్రేటర్​ నోయిడాల మధ్య మెట్రో సర్వీసును నడిపే ఎన్​ఎంఆర్​సీ డిప్యూటీ జనరల్​ మేనేజరు (కార్పొరేట్​ కమ్యూనికేషన్స్​) సంధ్యాశర్మ మట్లాడుతూ... నియామకానికి ముందే హిజ్రాలకు అవసరమైన శిక్షణ ఇచ్చామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: