ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ సొంత ఊళ్లపై ఫోకస్ పెట్టారు. ఎంత పెద్ద ప‌ద‌విలో ఉన్నా సొంత గ్రామంలో ఎవ‌రికి అయినా ప‌ట్టు అనేది అత్య‌వ‌స‌రం. ఈ క్ర‌మంలోనే త‌మ సొంత గ్రామాల్లో గెలుపును ఎవ‌రికి వారు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే క‌ర్నూలు జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ సొంత ఊరిలో పంచాయతీ టీడీపీకి ఏకగ్రీవం అయ్యింది.

కర్నూలు మండలం పి. రుద్రవరంలో టీడీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి ఎంకే మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో మొత్తం 10 వార్డుల్లో 1,154 ఓటర్లున్నారు. సర్పంచ్‌ స్థానాలకు ఐదుగురు నామినేషన్‌ దాఖలు చేయగా చివరకు నలుగురు పోటీ నుంచి తప్పుకోవ‌డంతో మ‌ధు ఏక‌గ్రీవంగా స‌ర్పంచ్‌గా ఎన్నిక‌య్యారు. ఆయ‌న గెలుపును ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. మధు కూడా ఎంపీ గోరంట్ల మాధవ్‌కు బంధువు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: