దేశ‌వ్యాప్తంగా క‌రోనా రెండో ద‌శ ప్రారంభ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌హారాష్ట్ర క‌రోనా కేసుల్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇటు ఏపీలోనూ క‌రోనా విజృంభిస్తోంది. క‌రోనా స్కూళ్ల‌లో విద్యార్థుల‌కు కూడా ఎక్కువుగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఏపీ ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ఏపీలోని చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంలో లాక్‌డౌన్ విధించారు. జిల్లాలోని కమ్మపల్లి పంచాయతీలో అధికారులు లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇక్క స్కూళ్లను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఇక్క‌డ 10 కొత్త క‌రోనా కేసులు న‌మోదు కావ‌డంతో రెడ్ జోన్‌లో పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: