కరోనా కష్టకాలంలో అల్లాడిపోతున్న ప్రజలకు తానున్నానంటూ ధైర్యం చెబుతూ ఆపన్నహస్తం అందిస్తున్నాడు నటుడు సోనూసూద్‌. ఆపదలో ఉన్నామని ఒక్క మెసేజ్  చేస్తే చాలు. క్షణాల్లోనే స్పందించి నిమిషాల వ్యవధిలోనే వారికి అవసరమైన సాయాన్ని అందిస్తున్నాడు. దీంతో కలియుగ కర్ణుడు అని ‘సోనూసూద్’కి ఒక బిరుదు ఇచ్చారు నెటిజన్లు. అలాగే ఆ మధ్య సోనూకి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు జరిపించిన సంఘటన గురించి కూడా మనం విన్నాం. మొత్తానికి కరోనా ఆపద్బాంధవుడిగా సోనూ చేసిన సేవలు, సాయాలు ముందు ఆయనకి ఎలాంటి సత్కారాలు జరిగిన అవ్వన్నీ చిన్నవే. అయితే తాజాగా సోనూ సూద్‌ భారత్ భవిష్యత్తు ప్రధానిమంత్రి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్‌ రాఖీ సావంత్ సోనూసూద్‌ను ‘భవిష్యత్ ప్రధాని’గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలపై సోనూ రీసెంట్‌గా రియాక్ట్ అయ్యాడు. తనకు సామాన్యుడిలా జీవించడమే ఇష్టమని చెప్పిన సోనూ.. తనకు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. "నేను ఒక సామాన్య వ్యక్తిగా బాగానే ఉన్నాను. నా సోదరులు రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నికలతో పోరాడటం ద్వారా నేను ఏం పొందుతాను? అది నా పని కాదు." అంటూ చెప్పుకొచ్చారు సోనూ సూద్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: