ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటివరకు 1000 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన మూవీలు ఏవి ..? అవి ఎన్ని కోట్ల కలెక్షన్లను అందుకున్నాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

బాలీవుడ్ స్టార్ నటలలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం దంగల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 1958 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 1810 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1775 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1290 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. యాష్ హీరోగా శ్రీ నీది శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1233 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. షారుక్ ఖాన్ హీరోగా నయనతార , దీపికా పదుకొనే హీరోయిన్లుగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1160 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. రన్బీర్ సింగ్ హీరోగా రూపొందిన దురంధర్ మూవీ ఇప్పటికే 1090 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా మరికొన్ని కలక్షన్లను వసూలు చేసి మరి కొన్ని స్థానాలు ముందుకు వెళ్లే అవకాశం చాలా వరకు ఉంది. ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1061 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్గా రూపొందిన పటాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1951 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: