స్పిరిట్ సినిమా పోస్టర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ మాత్రం ఎవరూ ఊహించని లెవెల్లో ఉండబోతున్నట్లు ఈ పోస్టర్ తోనే సందీప్ రెడ్డి వంగా చెప్పినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఫుల్ ఫిట్నెస్ తో ప్రభాస్ బాడీ పైన అనేక గాయాలు వాటికి సంబంధించి కట్టు కట్టినట్టుగా ఉంది. ఆఫ్ డేర్ బాడీతో ప్రభాస్ కుడి చేతిలో వైన్ బాటిల్, పెదాల మీద ఉన్న సిగరెట్ ను హీరోయిన్ త్రిప్తి డిమ్రి లైటర్ తో వెలిగిస్తూ ఉండడమే కాకుండా శారీలో చాలా హాట్ లుక్ లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
ప్రభాస్ ని అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలా సందీప్ రెడ్డి వంగా ఈ పోస్టర్ లో చూపించడంతో అభిమానుల సైతం పిచ్చెక్కిపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ లుక్ చూసిన కొంతమంది యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ను పోలి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్పిరిట్ టీమ్ మాత్రం ఇప్పటివరకు ఉన్నదాన్ని మీరు ప్రేమించారు.. ఇకమీదట మీకు తెలియని ఒక సరికొత్త ప్రేమలో పడండి అంటూ పేర్కొంది. గత ఏడాది స్పిరిట్ సినిమా నుంచి సౌండ్ స్టోరి పేరుతో ఒక ఆడియో గ్లింప్స్ విడుదల చేయగా వైరల్ గా మారింది. ముఖ్యంగా జైలర్ గా ప్రకాష్ రాజు వాయిస్ వినిపించగా, జైలుకు రిమాండ్ ఖైదీగా వెళ్లిన ఐపీఎస్ టాపర్ ప్రభాస్ వాయిస్ కూడా అందులో వినిపించింది. ప్రభాస్ చెప్పే డైలాగ్ హైలెట్ గా ఉంది. ప్రస్తుతం పోస్టర్ తో అయితే సినిమా అంచనాలను మరింత పెంచేశారు సందీప్ రెడ్డి వంగా
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి