సాధారణంగా నాగార్జున తన కుమారుల సినిమాల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోరు. నాగచైతన్య, అఖిల్ కూడా తండ్రి పేరును ఉపయోగించి దర్శకులు లేదా నిర్మాతలను సెట్ చేయమని అడిగిన సందర్భాలు చాలా అరుదు. ఇదే అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రత్యేకతగా చాలామంది చెబుతుంటారు. ఈ విషయాన్ని నాగచైతన్య కూడా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్టుగా సమాచారం. అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమాపై ఈసారి నాగార్జున ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని నిర్మాత నాగ వంశీ కూడా ఇటీవల ధృవీకరించారు. ఈ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న అంశాల నుంచి పెద్ద నిర్ణయాల వరకు నాగార్జున స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది.
స్క్రిప్ట్ ఎంపిక, షూటింగ్ విధానం, మేకింగ్ క్వాలిటీ వంటి ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని సమాచారం. అఖిల్ కెరీర్‌కు ఇది అత్యంత కీలకమైన సినిమా కావడంతో, ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అభిమానులు కూడా లెనిన్ సినిమా అఖిల్‌కు ఒక బలమైన కమ్‌బ్యాక్ కావాలని ఆశిస్తున్నారు. ఈ సినిమా పూర్తిస్థాయి హిట్‌గా నిలిస్తే, అఖిల్ కెరీర్‌కు పూర్తిగా కొత్త దిశ లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదే సమయంలో నాగచైతన్య అప్‌కమింగ్ సినిమాలపై కూడా నాగార్జున స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. తన ఇద్దరు కుమారుల కెరీర్‌లను మరింత బలంగా నిలబెట్టాలనే ఆలోచనతోనే నాగార్జున ఈ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయాలు తెలిసిన అక్కినేని ఫ్యాన్స్ మాత్రం, ఇక అక్కినేని ఫ్యామిలీకి మళ్లీ గోల్డెన్ డేస్ మొదలైనట్టే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి