ఆ ఈవెంట్‌లో రిద్ధి కుమార్ మాట్లాడుతూ, “ప్రభాస్ గారు నాకు చీర గిఫ్ట్ ఇచ్చారు” అని చెప్పగానే, అక్కడ ఉన్న అభిమానులు ఒక్కసారిగా అరుపులు, కేకలతో హాల్ మొత్తాన్ని దద్దరిల్లించారు. ప్రభాస్ అంటేనే చాలా సైలెంట్, రిజర్వ్డ్ నేచర్ ఉన్న హీరోగా ఇండస్ట్రీలో పేరుంది. ముఖ్యంగా హీరోయిన్స్‌తో కూడా చాలా లిమిటెడ్‌గా, గౌరవంగా మాత్రమే ఉంటాడనే ఇమేజ్ ఉంది. అలాంటి ప్రభాస్ ఒక హీరోయిన్‌కు చీర గిఫ్ట్ ఇచ్చాడంటే అది అభిమానులకు ‘వేరే లెవెల్’ విషయంగా మారింది.దాంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ మొదలయ్యాయి. “ప్రభాస్ చాలా స్పెషల్‌గా ట్రీట్ చేశాడు”, “రిద్ధి కుమార్‌లో ఏదో ప్రత్యేకత ఉంది”, “ఆమెకు ప్రభాస్ ఎంత గౌరవం ఇస్తాడో చూడండి” అంటూ అభిమానులు మాట్లాడుకోవడం ప్రారంభించారు. అంతకు ముందు వరకు రిద్ధి కుమార్ అంటే ‘రాధేశ్యామ్’ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసింది కదా అనే స్థాయిలో మాత్రమే గుర్తున్నవారు కూడా, ఇప్పుడు ఆమెను టాప్ మోస్ట్ సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నారు.
ఈ క్రేజ్‌తో గూగుల్‌లో ‘Riddhi Kumar Biography’, ‘Riddhi Kumar Background’, ‘Riddhi Kumar Movies’ అంటూ సెర్చ్‌లు భారీగా పెరిగాయి. ఫలితంగా ఆమె బ్యాక్‌గ్రౌండ్ వివరాలు అసోసియేషన్ మీడియా, సోషల్ మీడియా పేజీల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.రిద్ధి కుమార్ అసలు సినీ ప్రయాణాన్ని చూసుకుంటే, చాలా సింపుల్‌గా మొదలైంది. ఆమె అప్పుడెప్పుడో రాజ్ తరుణ్‌తో కలిసి నటించిన ‘లవర్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆపై ‘రాధేశ్యామ్’ సినిమాలో కనిపించి, అలా మెరిసి ఇలా మాయమైందనే భావన ప్రేక్షకుల్లో ఏర్పడింది.
కానీ తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ, హిందీ మరియు మలయాళం ఇండస్ట్రీల్లో మాత్రం రిద్ధి కుమార్ వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగింది. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్‌లలో నటించడంపై ఆమె ఎక్కువ ఆసక్తి చూపింది. అక్కడ ఆమె నటనకు మంచి గుర్తింపు రావడంతో, స్టెడీగా కెరీర్‌ను నిర్మించుకుంటూ వచ్చింది.రిద్ధి కుమార్ కేవలం నటిగానే కాదు, ఆమెలో చాలా హిడెన్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. ఖాళీ సమయం దొరికితే చాలు, ఆమె నేరుగా కిచెన్‌లోకి వెళ్లిపోతుంది. చాలా చక్కగా వంట చేస్తుందని, అద్భుతమైన వంటలు చేసి ఇంట్లో వాళ్లకే కాదు, నలుగురికి పంచి పెట్టడంలో ఆమెకు చాలా ఆనందం దొరుకుతుందని ఆమెను దగ్గరగా తెలిసినవాళ్లు చెబుతుంటారు.
అంతేకాదు, రిద్ధి కుమార్ మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ కూడా. ఖాళీ వేళల్లో పెయింటింగ్, స్కెచింగ్ చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. డ్యాన్స్ విషయంలో కూడా ఆమెకు మంచి గ్రిప్ ఉందని, ట్రైన్డ్ డ్యాన్సర్‌లా కాకపోయినా, చాలా గ్రేస్‌ఫుల్‌గా డ్యాన్స్ చేస్తుందని అంటున్నారు.ఇవన్నీ ఒకెత్తు అయితే, రిద్ధి కుమార్‌లో ప్రభాస్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకున్న విషయం ఆమె మంచి మనసేనని అభిమానులు భావిస్తున్నారు. ఆమె పేదవారికి సహాయం చేయడంలో ముందుంటుందని, తన దగ్గర ఉన్నదానిలో కొంతైనా అవసరమైన వారికి అందిస్తుందని ఇండస్ట్రీలో టాక్. ఈక్వాలిటీ, మానవత్వం వంటి విలువలను ఆమె నిజంగా ఫాలో అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇదే ఆమెను ప్రభాస్‌కు దగ్గర చేసింది అని అభిమానులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం రిద్ధి కుమార్ ‘రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ సినిమా కనుక హిట్ అయితే, ఆమె కెరీర్ పూర్తిగా మరో లెవెల్‌కు వెళ్లడం ఖాయం అనే అభిప్రాయం వినిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు, వెబ్ సిరీస్‌లు, కమర్షియల్ ప్రాజెక్టులు ఆమెను వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకం కూడా ఉంది.ఇప్పుడు రిద్ధి కుమార్ అని పిలవడం కన్నా, చాలామంది సరదాగా ఆమెను “ప్రభాస్ – చీర హీరోయిన్” అంటూ ఆటోపట్టిస్తున్నారు. ఇంకొందరు అయితే వాళ్లు డేటింగ్ చేస్తున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల కథలు అల్లుతున్నారు. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం అభిమానుల ఊహాగానాలే అని స్పష్టమైంది.
ఒక మాటలో చెప్పాలంటే, ఒక్క స్పీచ్‌తో, ఒక్క నిజాయితీగల మాటతో రిద్ధి కుమార్ తన చుట్టూ ఒక ప్రత్యేకమైన పాజిటివ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. టాలెంట్‌తో పాటు మంచి మనసు ఉంటే గుర్తింపు తానుగా వస్తుందనే దానికి రిద్ధి కుమార్ ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్‌గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి