ఈ ఇద్దరు తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని పాలించే నాయకులు.. ఒకరు సీఎం అయితే మరొకరు మంత్రి.. రాష్ట్రంలో మంచి హోదాలో ఉన్నారు. కాబట్టి వీరు ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా ప్రోటోకాల్ అనేది ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరు  చాలా రహస్యంగా పర్యటనలకు వెళ్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా పారదర్శకత పాటించాల్సిన వీరే ఇలా ఎవరికీ చెప్పకుండా పర్యటనలకు వెళ్లడం వెనుక  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం సృష్టించే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. సాధారణంగా వీరు ఎక్కడికైనా విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా జీవో విడుదల చేస్తారు. కానీ ఆ జీవోలను సైతం గోప్యంగా ఉంచి విదేశాలకు వెళ్తున్నారు. మరి ఇలా సీక్రెట్ గా పర్యటన వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటని, ప్రజా సమస్యలపైనే వీరు విదేశాలకు వెళ్తున్నారా లేదంటే వారి సొంత పనుల మీదే వెళ్తున్నారా అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. 

అయితే  ఈ ఇష్యూ పై టీడీపీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి గానీ సరైన సమాధానం అయితే చెప్పడం లేదని అంటున్నారు. గత నెలలో 30వ తేదీన హైదరాబాద్ వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో సతీమణితో కలిసి చంద్రబాబు విదేశాలకు వెళ్లారు.. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి, మంత్రులు,ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లిన తప్పనిసరిగా ముందస్తుగా ఉత్తర్వులు ఇస్తారు.. ఇలా ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రధాన కారణం  వారికి అక్కడ భద్రత ఏర్పాట్లు చేయడం కోసం ఇలా జీవోలు జారీ చేస్తారు.. అలా భద్రత ఏర్పాట్ల కోసమైనా తప్పనిసరిగా పర్యటన విషయాలను ముందస్తుగా బయటపెడతారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జీవోను బయట పెట్టకుండా విదేశీ పర్యటనకు వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీక్రెట్ గా మెయింటైన్ చేయడం ఎందుకని చాలామంది మేధావులు ప్రశ్నిస్తున్నారు..

 కేవలం చంద్రబాబు మాత్రమే కాకుండా ఆయన కుమారుడైనటువంటి మంత్రి లోకేష్ కూడా ఐదు రోజుల క్రితమే రహస్యంగా విదేశాలకు వెళ్లి వచ్చారు.. కానీ ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారు అనేది కూడా బయట పెట్టలేదు.. దీంతో కొంతమంది మేధావి వర్గాల వారు  ప్రజలతో జవాబుదారీగా ఉండాల్సిన వీరు ఇలా సీక్రెట్ గా పర్యటనలు వెళ్లడం వెనక ఆంతర్యం ఏంటని  ప్రశ్నిస్తున్నారు.. మరి చూడాలి దీనిపై చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ స్పందించి అసలు విషయాలను బయట పెడతారా.. లేదంటే మనకెందుకులే అని సైలెంట్ గా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: