ఏ రంగమైనా సరే – రాజకీయ రంగం అయినా, సినిమా రంగం అయినా – సోషల్ మీడియా ట్రోలింగ్ హద్దులు మీరిపోతోంది. వ్యక్తిగత విమర్శల పేరుతో అసభ్య పదజాలాన్ని వాడటం, మహిళలను అవమానపరచడం, సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖులను, ముఖ్యంగా టాప్ స్థాయి రాజకీయ నాయకులను కించపరచడం లాంటివి రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఒక సభ్య సమాజం తలదించుకునే స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్ మరింత ఆందోళన కలిగిస్తోంది. వారి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం, వారి వ్యక్తిగత జీవితాలపై అనవసర ఆరోపణలు చేయడం వంటి ఘటనలు చాలా సాధారణంగా మారిపోయాయి. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య.
అలాగే రాజకీయ పరంగా చూస్తే, అభిప్రాయ భేదాలు ఉండటం సహజమే అయినా, వాటిని వ్యక్తపరచే విధానం మాత్రం సంస్కారవంతంగా ఉండాలి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ చూస్తే, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం దేశ ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తున్నాయి.ఈ నేపథ్యంలో 2026లో అయినా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పెద్దమనసు చేసుకొని సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కాదు, కానీ సరైన లిమిట్స్, కఠినమైన నియమాలు, ట్రోలింగ్‌పై స్పెషల్ కాన్సన్‌ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఉందని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. కానీ ఆ స్వేచ్ఛ ఇతరుల గౌరవాన్ని హరించేలా ఉండకూడదు. అందుకే సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించేలా కొత్త చట్టాలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. ట్రోలింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.ఇప్పుడు అందరి చూపు 2026పై ఉంది. ఈ ఏడాదిలో అయినా నరేంద్ర మోడీ గారు ఈ సమస్యపై సీరియస్‌గా స్పందించి, సోషల్ మీడియా ట్రోలింగ్‌కు అడ్డుకట్ట వేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. దేశ భవిష్యత్తు, యువత ఆలోచన విధానం, సమాజ సంస్కృతి అన్నీ ఈ నిర్ణయాలపై ఆధారపడి ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.2026 నిజంగా ఒక మార్పు తీసుకువచ్చే సంవత్సరం కావాలని, మంచి విలువలతో, బాధ్యతాయుతమైన సోషల్ మీడియా వినియోగంతో భారతదేశం ముందుకు సాగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి