ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి రైతులు వ్యవసాయ కూలీలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిగ్గర్ మైట్స్ (నల్లులు) కుట్టడం వల్ల ఈ బ్యాక్టీరియా బారిన పడుతున్నారని, ఈ బ్యాక్టీరియా బారిన పడ్డ వారిలో జ్వరం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, నల్లి కుట్టినచోట నల్లటి మచ్చలు ఏర్పడడం వంటివి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే సకాలంలో ఈ వ్యాధి గుర్తించకపోవడం వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి ముదిరి శరీర అవయవాల మీద తీవ్రమైన ప్రభావం చూపి దెబ్బతీస్తున్నాయని వైద్యులు సైతం చెబుతున్నారు.
ఈ విషయం పైన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అందుకు తగ్గ నివారణ చర్యలు చేపట్టింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా ఈ వ్యాధి నిర్ధారణకు సంబంధించిన కిట్లను పంపిణీ చేయడమే కాకుండా అవసరమైన యాంటీబయోటిక్ మందులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా రైతులు, కూలీలు కూడా ఒళ్లంతా కప్పేలా దుస్తులను ధరించాలని జ్వరం వచ్చిన వెంటనే ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలంటు సూచిస్తున్నారు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని పిచ్చి మొక్కలు పెరగకుండా చాలా జాగ్రత్త పాటించాలని, ఎలుకలు తిరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇలాంటివన్నీ చూసుకోవడం వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చని వైద్యుల సైతం సలహా ఇస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి