కొవాగ్జిన్‌ టీకాల స‌ర‌ఫ‌రా విష‌యంలో త‌మ కంపెనీ స్పంద‌న‌పై కొన్ని  రాష్ట్రాలు  చేస్తున్న ఫిర్యాదుల ప‌ట్ల భార‌త్ బ‌యోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సుచిత్ర ఎల్లా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ నెల 10వ తేదీన 18 రాష్ట్రాల‌కు కొవాగ్జిన్‌ను షిప్‌మెంట్స్‌లో పంపామ‌ని ట్విట‌ర్‌లో పేర్కొన్నారు.  త‌మ ఉద్దేశాల‌పై కొన్ని  రాష్ట్రాలు  చేస్తున్న ఫిర్యాదులు త‌మ‌కు నిరుత్సాహం క‌లిగిస్తున్నాయ‌న్నారు. కొవిడ్ కార‌ణంగా భార‌త్ బ‌యోటెక్ సంస్థ‌లో 50 మంది ఉద్యోగులు విధుల‌కు హాజ‌రు కాలేక‌పోతున్నార‌ని.. 50 మంది ఉద్యోగులు అందుబాటులో లేర‌ని, అయిన‌ప్ప‌టికీ మీ కోసం రేయింబ‌వ‌ళ్లు కష్ట‌ప‌డుతున్నామ‌ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: