పశ్చిమగోదావరి
జిల్లా : పాలకొల్లు
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గంలో
సైకిల్ యాత్ర చేపట్టారు.కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు వ్యాక్సిన్లు, ఆసుపత్రుల్లోమ బెడ్స్,ఆక్సిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తే ఆయన నియోజకవర్గంలో
సైకిల్ యాత్ర చేపట్టారు.వీటితోపాటు పేదవాళ్లకు రూ.10వేల ఆర్థిక సాయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకొల్లు నుంచి యలమంచిలి మండలంలో కాజాతూర్పు, కాజపడమర,రామరాజు చెరువు గ్రామాల్లో పర్యటించి కోవిడ్ బాధితులకు ఉచితంగా నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రజలను కలుస్తూ తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు నిమ్మల రామానాయుడు.కరోనా విపత్కర పరిస్థితుల్లో
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.కరోనా మొదటి దశ నుంచి ఇప్పటి వరకు ప్రజలకు అండగా నిలుస్తున్నారు.ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోతే తానే స్వయంగా వచ్చి జనరేటర్‌లో
డీజిల్ పోసి ప్రజల ప్రాణాలు కాపాడారు.