
హీరోయిన్ మీరా చోప్రా కేసులో ట్విట్టర్ కు మరోసారి నోటీసులు జారీ చేశామని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ పేర్కొన్నారు. మీరా చోప్రా పై గతంలో ట్విట్టర్ లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదు చేసిందని మీరా చోప్రా ఫిర్యాదు పై కేసు నమోదు చేశామన్న ఆయన గతంలో కేసు నమోదు చేయగా ట్విట్టర్ లో పెట్టిన పోస్టులు డిలీట్ చేశారని దీంతో ఐటి యాక్ట్ 67, 67ఏ కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.
అసభ్యకర పదజాలంతో ట్విట్టర్ లో మీరా చోప్రా పై కామెంట్ చేసిన వారి వివరాలు ఇవ్వాలని మరోసారి ట్విట్టర్ కు నోటీసులు ఇచ్చామన్న ఆయన ఇప్పుడు ట్విట్టర్ 84 , 109 అబిట్ మెంట్ యాక్ట్ ప్రకారం ట్విట్టర్ పై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.