రియల్ హీరోగా మారిన రియల్ విలన్ సోనూ సూద్ అనేక అంశాల్లో సేవ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. భాష ప్రాంతం, సరిహద్దులు తేడా లేకుండా ఆయన భారత దేశం మొత్తం మీద ఎవరికి అవసరం వచ్చినా తాను ఉన్నాను అంటూ ముందుకు వస్తున్నాడు. వలస కూలీలకు ముందుగా సాయం చేయడం ప్రారంభించిన ఆయన ఇప్పుడు ఏకంగా ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన ఆస్తి ఎంత ? ఆయన చేస్తున్న సేవ ఎంత అనేది లెక్కలు వేస్తే ఆశ్చర్యం కలుగక మానదు.


 తాజాగా ఆయన పుట్టపర్తికి చెందిన ఒక ఆరు నెలల బాలికకు గుండె ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. ట్విట్టర్లో మే నెలలో పుట్టపర్తికి సంబంధించిన సురేష్ అనే వ్యక్తి తన ఆరు నెలల కుమార్తెకు హార్ట్ లో సమస్య ఉందని ఆమెకు ఆపరేషన్ చేయించాలని కోరగా తాజాగా దానికి సోనూ స్పందించాడు/ రేపు ఆమెకు హార్ట్ సర్జరీ జరుగుతుందని నీ కూతురు నా బాధ్యత అని ఆయన అభయమిచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: