రౌడీ హీరో విజయ్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌ హీరోగా న‌టిస్తున్న సినిమా పుష్ప‌క విమానం. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాకు దామోద‌ర‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. కాగా ఈ సినిమా నుండి ఓ వెడ్డింగ్ సాంగ్ ను ఈ రోజు టాలీవుడ్ బ్యూటీ అక్కినేని స‌మంత చేతుల మీదుల‌గా విడుద‌ల‌ చేశారు. ఈ సంద‌ర్భంగా స‌మంత త‌న సోష‌ల్ మీడియా ద్వారా సాంగ్ ను లాంచ్ చేసింది.

అంతే కాకుండా ఈ పాట‌ను లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని పేర్కొంది. టీం అంద‌రికీ కంగ్రాట్స్ తెలిపింది. అయితే త‌న త‌మ్ముడి పాట‌ను స‌మంత లాంచ్ చేసినందుకు గానూ విజ‌య్ దేవ‌ర‌కొండ‌  కృత్ఞ‌త‌లు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు. థాంక్యూ సామ్ బిగ్ హ‌గ్స్ మ‌రియు ప్రేమ అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న పోస్ట్ లో పేర్కొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: