
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం "ఆర్ ఆర్ ఆర్". తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించి అభిమానుల దిల్ ఖుష్ చేసేశారు మేకర్స్. "ఆర్ ఆర్ ఆర్"కు సంబంధించిన మేకింగ్ వీడియోను "రోర్ అఫ్ ఆర్ ఆర్ ఆర్" అనే పేరుతో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ వీడియో జూలై 15న ఉదయం 11 గంటలకు రిలీజ్ కానుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, త్వరలోనే రాజమౌళి సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పాత్రలకు సంబంధించి రెండు భాషల్లో డబ్బింగ్ ను పూర్తి చేసేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఓవిలియా మోరిస్, అజయ్ దేవగన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న "ఆర్ఆర్ఆర్" మూవీ ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.