ఓట్ల కోసం హత్యలు చేయడమనేది వైఎస్ కుటుంబానికి కొత్తేమీ కాదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సీబీఐ దర్యాప్తులో భాగంగా వైఎస్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తుంటే వేవికానందరెడ్డిని వేటాడింది సొంతింటి వేటకొడవలే అన్న విషయం స్పష్టమవుతోందన్నారు. శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ జగన్‌పై నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసం బాబాయినే హత్యచేయించి ఆ రక్తాన్ని చంద్రబాబు చేతికి అంటించాలని చూశారని, నారాసుర రక్తచరిత్ర అంటూ ఆ రక్తం అంటిన గొడ్డలిని చంద్రబాబు చేతిలో గ్రాఫిక్స్ ద్వారా పెట్టించి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారంటూ మండిపడ్డారు. ఆ కుటుంబం రక్తంలోనే ఫ్యాక్షన్ ఉందని, వారికి ఫ్యాక్షన్ కొత్తకాదన్నారు. తరతరాలుగా వైఎస్సాసుర రక్తచరిత్ర అంతా రక్తంతో తడిచిపోయిందని, నేరాలు, దౌర్జన్యాలు, అక్రమాలు వారికి కొత్తేమీ కాదన్నారు. అతిత్వరలోనే వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులెవరనేది ప్రజలందరికీ తెలవబోతోందని, అందుకు తొందరపడాల్సిన అవసరమేమీ లేదన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి