రూ.400 నుంచి రూ.2500 మద్యం కేసుకు 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకున్నది. రూ.2,500 నుంచి రూ.3,500 ఉన్న మద్యం కేసుకు 55 శాతం వరకు వ్యాట్ విధించినది. రూ.3500 నుంచి రూ.5000 ధర ఉన్న మద్యం కేసు పై 50 శాతం వ్యాట్ ఉండనున్నది. రూ.5వేలు, ఆపై మద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకున్నది. దేశీయ తయారీ బీర్ కేసుపై రూ200 కంటే తక్కువగా ఉన్న వాటిపై 50 శాతం వ్యాట్ వేయనున్నారు ఇక. రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీరు కేసుపై 60 శాతం వ్యాట్ విధించనున్నారు. అన్నీ రకాల మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని ఎక్సైజ్‌శాఖ నిర్ణయం తీసుకున్నది. రెడీ టూ డ్రింక్‌లపై 50 శాతం వ్యాట్ విధిస్తున్నట్టు ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి