కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ, వైసీపీ మధ్య ఫలితాలు నువ్వా- నేనా అన్నట్టుగా కొనసాగుతున్నాయి. మొత్తం 29 వార్డులకు 26 వార్డుల కౌంటింగ్ పూర్తైంది. 26 వార్డుల్లో 12 వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. ఇక అధికార వైసీపీ 13 వార్డులను సొంతం చేసుకోగా.. 1 వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

అటూ కృష్ణా జిల్లా  జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటిని కైవసం చేసుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నం చేసింది కానీ ఓట‌ర్లు ఇద్ద‌రికీ పోటా పోటీగా ఓటు వేయ‌డంతో ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ముఖ్యంగా కుప్పం త‌రువాత టీడీపీ కంచుకోట‌గా కృష్ణా జిల్లాకు పేరుంది. జ‌గ్గ‌య్య‌పేట ఎప్ప‌టి నుంచో టీడీపీకి కంచుకోట అని చెప్పుకుంటారు. జ‌గ్గ‌య్య‌పేట‌లో వెలువ‌డిన ప్ర‌తివార్డు ఫ‌లితంపైనా పెద్ద వివాద‌మే కొన‌సాగుతుంది.
వైసీపీ అభ్య‌ర్థి.. పై టీడీపీ అభ్య‌ర్థి టీడీపీ అభ్యర్థి సూర్యదేవర ఉషారాణి 14 ఓట్లతో గెలిచినట్టు అధికారులు ప్ర‌క‌టించినా.. వైసీపీ నేత‌లు ధ‌ర్నా చేసి మ‌రీ రీ కౌంటింగ్ చేయించారు. అయినా టీడీపీ అభ్య‌ర్థి గెల‌వ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: