వారు నిండు నూరేండ్లు క‌లిసి మెలిసి జీవించాల‌ని ఎన్నో క‌ల‌లు కంటూ వివాహం చేసుకున్నారు. ఆ నూత‌న వ‌ధూవ‌రులు క‌లిసి వ‌ధువు పుట్టింటికి వెళ్లుతుండ‌గా మార్గ మ‌ధ్య‌లో రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో  నిన్న వ‌రుడు  మృతి చెందాడు.  ఆ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన వ‌ధువుచికిత్స పొందుతూ  ఇవాళ మృతి చెందింది.  అంత‌సేపు ప‌చ్చ‌ని పెళ్లి పందిరి, బంధువులు, కుటుంబ‌స‌భ్యుల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన  ఇంట్లో ఒక్క‌సారిగా ప్ర‌మాదం చోటు చేసుకొని నూత‌న వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ మృతి చెంద‌డంతో తీవ్ర విషాదం నెల‌కొన్న‌ది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగం పల్లి కి చెందిన శ్రీనివాసులుకు, తమిళనాడుకు చెందిన కనిమొళితో   పెళ్లి జరిగింది.  తిరుపతిలో పెద్ద‌ల స‌మ‌క్షంలో  అంగరంగ వైభవంగా ఒక్క‌టైన ఈ జంట చెన్నై వెళ్తుండగా దుర్ఘటన ఎదురైంది. శ్రీనివాసులు తన భార్య కనిమొళితో కలిసి అత్తారింటివెళ్తుండగా కారు ప్రమాదం సంభ‌వించింది.  ఈ ఘటనలో నవ నరుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లిన వధువు కనిమొళిని  చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పెళ్ళైన 24 గంటలు గడవక ముందే శ్రీనివాసులు ప్రాణాలు పోగొట్టుకోగా.. చికిత్స పొందుతూ ఇవాళ‌ వధువు కనిమొళి మృతి చెందింది.


మరింత సమాచారం తెలుసుకోండి: