ఐపీఎల్‌ స్టార్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు మెయిన్ ప్లేయర్‌ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ టోర్నీకి తాను రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు అంబటి రాయుడు.ఇక ఈ మేరకు తన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేశారు.ఐపీఎల్‌ లో తన ప్రయాణానికి సహకరించిన ముంబై ఇంకా చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు ప్లేయర్‌ అంబటి రాయుడు. “ఇది నా చివరి ఐపిఎల్ అని ప్రకటించడానికి చాలా సంతోషిస్తున్నాను. నేను 13 సంవత్సరాలుగా 2 గొప్ప జట్లలో భాగమైనందుకు మంచి అద్భుతమైన సమయాన్ని కలిగి ఉన్నాను. అద్భుతమైన ప్రయాణం కోసం ముంబై ఇండియన్స్ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.” అంటూ అంబటి రాయుడు ప్రకటించారు.ప్రస్తుతం అంబటి రాయుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ సంవత్సరం ఐపీఎల్‌ లో అంబటి రాయుడును 6.75 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: