రాజకీయాల్లో పదవులు రావాలంటే ఎన్నికల్లోనే పోటీ చేయనక్కర్లేదు. అన్నీ పదవులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే వారు.. కొన్ని పరోక్ష ఎన్నికల ద్వారా కూడా వస్తాయి. అలాంటి పదవులు పార్టీ అధినేతల ఇష్టాన్ని బట్టి పంపకాలు చేస్తుంటారు. అలాంటి వాటిలో రాజ్యసభ సీట్లు కొన్ని. అయితే.. సీఎం జగన్ దగ్గర కీలకమైన పనులు చేస్తే చాలు.. వారికి ఎంపీ సీటు వస్తుందన్న టాక్ వినిపిస్తోంది.


గతంలో సీఎం జగన్  దగ్గర ఆడిటర్‌గా పని చేసిన విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత ఎంపీ అయ్యారు. ఇప్పుడు మరోసారి కూడా ఆయనకు అవకాశం లభించింది. అలాగే గతంలో జగన్ ఫిజియో థెరపిస్టుగా పని చేసిన గురుమూర్తికి తిరుపతి ఎంపీ సీటు లభించింది. ఆయన ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారు. ఇక తాజాగా జగన్‌ కేసులు వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డికి ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: