మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమున హ్యాచరిస్ ఆధీనంలో ఉన్న భూములను కేసీఆర్ సర్కారు రైతులకు పట్టాలు చేసి ఇచ్చేసింది. ఈ సంస్థ భూకబ్జా చేసిన భూములను న్యాయబద్ధంగా రైతులకు పట్టాలు పంచిన ఇచ్చామని టీఆర్ఎస్ స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు.
జమున హ్యాచరిస్ పేద ప్రజల భూములను కబ్జా చేసిందన్న ఆరోపణులు ఉన్నాయి. దీనిపై అక్కడి రైతులు తమ పొలాలు జమున హ్యాచరిస్ అధినేత ఈటల రాజేందర్ కబ్జా చేసాడు అని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై తక్షణమే ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులను భూకబ్జా గురించి సర్వే చేయాలని ఆదేశించింది. కలెక్టర్ ఆ భూకబ్జా గురించి ఆరా తీసి నిజానిజాలు తెలుసుకుని భూకబ్జా చేసింది నిజమే అని ఆధారాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం ఎవరివైతే కబ్జాకు గురైన భూముల పట్టాలని మెదక్ ఎంపీ, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి  అధికారులతో కలిసి రైతులకు భూమి పట్టాలు అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: