రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి ఆర్థికంగా చేయూత అందించాలని నిర్ణయిచింది. ఏకంగా 820 మిలియన్‌ డాలర్లు అందివ్వాలని నిర్ణయం తీసుకుంది. రష్యా దాడులతో చితికిపోతున్న ఉక్రెయిన్‌కు అమెరికా మళ్లీ ఆర్థిక సాయం ప్రకటించింది.


820 మిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని అందజేయనుంది. ఈ సాయం ద్వారా ఉక్రెయిన్‌ సైనిక శక్తిని బలపరిచాలన్నది అమెరికా ఆలోచన. అందుకే ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే సరికొత్త క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్‌కు అందించాలని అమెరికా నిర్ణయించింది. ఇప్పటి వరకు అమెరికా ఉక్రెయిన్‌కు దాదాపు  7 బిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని అందించింది. ఇంకా  8.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలు  అందివ్వాలని అమెరికా భావిస్తోంది. మొత్తానికి ఉక్రెయిన్‌కు సాయం చేయడం ద్వారా రష్యాకు ముకుతాడు వేయాలన్నది అమెరికా వ్యూహం.

మరింత సమాచారం తెలుసుకోండి: