ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఎల్లుండి ప్రధాని మోదీ, సీఎం జగన్ భీమవరం వస్తున్నారు. అయితే.. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన కేవలం 2–3 గంటలు ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ మోదీ భీమవరం ఎందుకు వస్తున్నారంటే.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా స్వాతంత్య్ర పోరాట విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోదీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వస్తున్నారు. అక్కడ జరిగే అల్లూరి జయంతి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగించే అవకాశం ఉంది.

ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న మోదీ.. సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 10 – 10.40 గంటల మధ్య గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడ  ప్రధానికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు, అధికారులు, కొద్దిమంది బీజేపీ నాయకులు స్వాగతం పలుకుతారు. తర్వాత ప్రధాని, ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్‌లో భీమవరం చేరుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: