ఏపీలో పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం చాలా శ్రద్ధ వహిస్తోంది. నాడు నేడు పేరుతో అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. నాడు నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో సదుపాయాల భద్రత కోసం వాచ్‌మెన్‌ లను సైతం నియమించనుంది. స్కూళ్ల నిర్వహణపై అంతిమంగా కలెక్టర్లు, జేసీలే  బాధ్యత వహించాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ దిశగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల నిర్వహణపై ఒక కాల్‌ సెంటర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేసింది.


స్కూళ్ల నిర్వహణపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు.  స్కూళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయడంలేదన్న మాట ఎక్కడా రాకూడదని ప్రభుత్వం భావిస్తోంది. వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణపోషణ ప్లస్‌ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తోంది. సంపూర్ణపోషణపై  గట్టి పర్యవేక్షణ ఉండాలని భావిస్తునత్న ప్రభుత్వం.. పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని అధికారుకు సూచిస్తోంది. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను  భర్తీ చేయాలని ఇటీవల  సీఎం ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: