పవన్‌ కల్యాణ్‌ నిజంగా.. అంత అమాయకుడా అని ఆశ్చర్యపోతున్నారు  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. వైసీపీ,బీజేపీ పార్టీలు పెళ్ళి మాత్రమే చేసుకోలేదని, కానీ చక్కగా కాపురం చేసుకుంటున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  అంటున్నారు. ఈ రెండు పార్టీలు చాలా ఒద్దికగా కలిసిపోయాయని, ఒకరి అవసరాలు మరొకరు తీరుస్తున్నాయని అన్నారు.


అయితే... ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతా కలిసి కట్టుగా పోరాడాలని అన్న జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ బిజెపీ రోడ్డు మ్యాప్‌ గురించి ఆలోచిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలో తెలీడంలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  అన్నారు. బీజేపీ, వైసీపీ బంధం గురించి పవన్‌ కళ్యాణ్‌ అమాయకత్వం నటిస్తున్నారో.. లేదా నిజంగా అమాయత్వం ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  అన్నారు. రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయి, పాలన సాగించలేని పరిస్థితి నెలకొందని రామకృష్ణ అన్నారు. బడ్జెట్‌లో 43వేల కోట్ల రూపాయల అప్పుగా చూపించి, ఆరునెలల వ్యవధిలోనే 49వేల కోట్ల రూపాయలు వినియోగించిన ఘనత ఈ జగన్  ప్రభుత్వానిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: