ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకం ప్రారంభించబోతున్నారు. ప్రజలకు మేలు జరిగేలా ‘జగనన్న సురక్ష’ అనే పథకం ప్రారంభిస్తున్నారు. దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం గురించి సీఎం వైయస్‌ జగన్‌ క్షుణ్ణంగా తమకు వివరించారని చెప్పారు. నెలరోజుల పాటు జరిగే ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి, అధికారులు, గృహ సారథులు, వలంటీర్లు, కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు ఏం చేయాలో జగన్ వివరించారు.


జగనన్న సురక్ష అద్భుతమైన కార్యక్రమం అంటున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు  వచ్చే 9 నెలలు చాలా కష్టపడాలని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని సీఎం తమకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో 175  స్థానాలు కచ్చితంగా గెలుపొందాలని సీఎం జగన్ తమకు టార్గెట్‌ పెట్టినట్టు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: