రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను  ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. ఇటీవల 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం పాలనలో మానవీయతకు నిదర్శనమని కేటీఆర్‌ అన్నారు. ఒకటి, రెండు రోజుల్లో వీఆర్ఏ, ఆర్టీసీ కార్మికులతో ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్చార్జిలకు మంత్రి కేటీఆర్ సూచించారు.

అనాధలందరినీ ఒక పాలసీ కిందకు తీసుకురావడం చరిత్రాత్మక నిర్ణయమని కేటీఆర్ అంటున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. మెట్రో విస్తరణ జరగనున్న నియోజకవర్గాల్లో పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలన్నారు. మెట్రో విస్తరణ పూర్తయితే హైదరాబాద్ చుట్టుపక్కలున్న సుదూర ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయన్న విశ్వాసాన్ని ప్రజలకు అందించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: