ఏపీని తుపాను ముప్పు వణికిస్తోంది. తుఫాన్ ను ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్లు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈనెల 3,4,5 తేదీల్లో భారత వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికతో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి పరిస్థితి నైనా ఎదురకోవడానికి సంసిద్ధంగా ఉండాలని.. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా అన్ని ముందస్తు చర్యలు  చేపట్టాలని సూచిస్తున్నారు. తుఫాను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని.. తుఫాను అనంతరం చేపట్టాల్సిన నివారణ చర్యలపై సిద్దంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.


కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు. 1077 కాల్ సెంటర్ 24 గంటలు పనిచేసేలా సిబ్బందిని నియమించారు. డివిజన్ కేంద్రాల్లో కూడా  కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు..  సిబ్బందికి  సెలవులు రద్దు చేశారు. ఇరిగేషన్ అధికారులు ప్రధానంగా సోమశిల, కండలేరు వంటి జలాశయాలపై పూర్తి పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. ఎప్పటికప్పుడు నీటి నిల్వలను పరిశీలిస్తూ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: