తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ్టి నుంచి ప్రజాదర్భార్‌ నిర్వహించనున్నారు. ఇక జ్యోతి బాపూలే ప్రజాభవన్‌లో ఇవాళ్టి నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తామని నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు కూడా క్లారిటీ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకూ కేసీఆర్‌ నివాస భవనంగా ఉపయోగించిన ప్రగతి భవన్‌లోనే ఈ ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. గతంలో ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండేది.

దాన్ని కేసీఆర్‌ సీఎం అయ్యాక కొత్తగా సీఎం నివాసంగా ప్రగతి భవన్‌ నిర్మించారు. అయితే.. ఈ ప్రగతి భవన్‌లోకి సామాన్యులకే కాకుండా ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా అంత సులభంగా ప్రవేశం ఉండేది కాదన్న విమర్శలు కేసీఆర్‌ కు చెడ్డపేరు తీసుకొచ్చాయి. గతంలో ఓసారి ఇక్కడ ధర్నా నిర్వహించిన అప్పటి ప్రతిపక్షనేత రేవంత్ రెడ్డి.. ఈ కంచెలను కూల్చి వేస్తామని అన్నారు. ఇప్పుడు సీఎం అయ్యాక ఆ మాట నిలబెట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: