కేసీఆర్‌ అడుగు జాడలోనే రేవంత్‌రెడ్డి నడుస్తున్నారా అంటే అవునంటున్నారు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. అందుకు సాక్ష్యం కాంగ్రెస్‌ తొలి మంత్రి వర్గమే అంటున్నారు. కాంగ్రెస్‌ కొత్త ప్రభుత్వంలోనూ అగ్రకులాలకు పెద్దపీట వేశారని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తక్కువ పదవులు, కేవలం 7 శాతం ఉన్న వెలమ, రెడ్డిలకు 7 మంత్రి పదవులు ఎలా ఇచ్చారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందాలని మందకృష్ణ మాదిగ అన్నారు. త్వరలో ప్రభుత్వం ప్రకటించించే మెగా డీఎస్సీ నియామకాలను నిలిపి వేయాలని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే డీఎస్సీతో పాటు ప్రభుత్వం ఉద్యోగ నోటిపికేషన్‌ విడుదల చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ది దొరల పాలన అన్న మందకృష్ణ మాదిగ అందుకే ప్రజలు ఆయనను దించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: