ఈసారి పొరపాటున భాజపాకు ఓటేస్తే పెట్రోల్, డీజీల్ రూ.400లు దాటిపోతుందని.. -సిలిండర్ ధరలు ఐదువేలు దాటిపోతుందని బీఆర్ఎస్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని భాజపా ఆలోచన చేస్తుందని.. దాన్ని అడ్డుకోవాలంటే గులాబీ జెండా పార్లమెంట్‌లో ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఒకవైపు తెలంగాణ కోసం పేగులు తెగెలా కొట్లాడిన భారసాకు, కుర్ కురే పార్టీ భాజపాకు, కిరికిరి పార్టీ కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతుందని సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు అన్నారు.

కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుంది మీ కష్టాలు మాకు తెలుసు.. మే 13న జరిగే ఎన్నికల్లో 10-12 ఏంపీ సీట్లు అప్పగించండి.. ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుంది... రాష్ట్రంలో కేసీఆర్ చెప్పిందే నడుస్తుంది... గత ఎన్నికల్లో బడాభాయ్ మోదీ మోసం చేశారు, ఇటీవల వచ్చిన ఎన్నికల్లో చోటాభాయ్ రేవంత్ మోసం చేశారు..ఐదు పార్లమెంట్ సీట్లతో తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్.. తెలంగాణకు ఎప్పటికైనా గులాబీ జెండానే శ్రీరామరక్ష అంటున్నారు పద్మారావు.


మరింత సమాచారం తెలుసుకోండి: