ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ని స్పీకర్  ఛాంబర్ లో పూజలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకుంటూనే తొలి సంతకం ఈటీవీ న్యూస్‌ ఛానల్‌కు అనుకూలంగా ఓ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ప్రాంగణంలోకి ఈటీవీకి అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన నిబంధనల ఫైల్‌ను కొట్టివేస్తూ తొలి సంతకం చేశారు.


ఈటీవీ పై ఉన్న ఆంక్షలు తొలగించాలని స్పీకర్ కు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆయనకు లేఖ ఇచ్చారు. దాన్ని పరిశీలించిన స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు.. తక్షణమే ఆంక్షలు సడలిస్తూ తొలిసంతకం చేశారు. ఈటీవీని సభలోకి రావొద్దనే పిచ్చి నిర్ణయం ఎవరు తీసుకున్నారంటూ అసెంబ్లీ కార్యదర్శిని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. గతంలో అసెంబ్లీ కార్యక్రమాల ప్రసారాల విషయంలో ఈటీవీ నియమాలు ఉల్లంఘించిందంటూ అప్పటి స్పీకర్‌ ఈటీవీని సభా ప్రాంగణం నుంచి బహిష్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: