మే నెల స్టార్ట్ అయింది అంటే చాలు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైతులు ఎప్పుడు నుండి వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పటి నుండి పంటలు వేసుకోవాలి అనే దానిపై అనేక ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ఎక్కువ శాతం మే ముగింపు దశకు వచ్చే సరికి వర్షాలు ఎప్పటి నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సంవత్సరం ఏ స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే నివేదికలు విడుదల అవుతూ ఉంటాయి. ఇకపోతే ఈ సారి మాత్రం వర్షాలు ఈ సంవత్సరం ఎప్పటి నుండి పడబోతున్నాయి ..? ఏ స్థాయిలో పడబోతున్నాయి ..? ఈ సారి రుతుపవనాలు ఎప్పటి నుండి స్టార్ట్ కాబోతున్నాయి అనే వార్త చాలా ముందు గానే వచ్చింది.

దానితో రైతులు చాలా ఆనంద పడుతున్నారు. ఇక ఈ సారి వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుండి పడబోతున్నాయి అనే వివరాలను (ఐ ఎం డి) వివరించింది. తాజాగా (ఐ ఎం డి) తెలంగాణ కి అద్భుతమైన గుడ్ న్యూస్ ను చాలా ముందుగానే చెప్పింది. ఈ సారి అంచనాల కంటే చాలా ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించబోతున్నట్లు (ఐ ఎం డి) సంస్థ తెలియ జేసింది. ఈ నెల 13 న అండమాన్ కు చేరి మే నెల చివరన తెలంగాణను రుతుపవనాలు తాకబోతున్నట్లు వెల్లడించింది.

దీనితో ఈ సారి తెలంగాణ లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని (ఐ ఎం డి) చెప్పుకొచ్చింది. ఇక పోయిన సంవత్సరం నైరుతి రుతుపవనాలు మే 31 న అండమాన్ లో జూన్ రెండవ వారంలో తెలంగాణలో విస్తరించాయి. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సారి నైరుతి రుతుపవనాలు చాలా ముందుగానే తెలంగాణ ప్రాంతాన్ని తాకబోతున్నాయి. మరి ఈ సారి తెలంగాణలో భారీ వర్షాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: