ముత్తూట్ ఫైనాన్స్ కస్టమర్లకు సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఆభరణాలకు ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తోంది. దీని కోసం ముత్తూట్ ఫైనాన్స్.. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.ముత్తూట్ ఫైనాన్స్ కొత్త ఇన్సూరెన్స్ సేవలను ముత్తూట్ గోల్డ్ షీల్డ్ పేరుతో కస్టమర్లకు అందించనుంది. దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ముత్తూట్ ఫైనాన్స్ కస్టమర్ అయ్యి ఉండాలి. అంటే మీరు ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ లోన్ తీసుకొని ఉంటారు.