క్యాండీలు తినేందుకు విదేశాల్లో పోటీలు కూడా పెడుతుంటారు. అంతగా క్యాండీలకు ప్రాచుర్యం ఉంటుంది. అందుకేనేమో.. క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావాలంటూ కెనడాకు చెందిన ఒక క్యాండీ తయారీ కంపెనీ ప్రకటన జారీచేసింది.అంటారియోలోని మిస్సిసాగాలో ఉన్న క్యాండీ తయారీ కంపెనీ క్యాండీ ఫన్హౌస్ తమ క్యాండీలను రుచి చూసి ఏవిధంగా ఉన్నాయో సమీక్ష జరిపి చెప్పేందుకు ఉద్యోగులు అవసరమని కెరీర్స్లో ప్రకటన ఇచ్చింది.