టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ మార్కెట్ ధర రూ.1,15,000. మీరు రూ.15 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి ఈ స్కూటర్ కొనుగోలు చేస్తే.. మిగిలిన మొత్తానికి లోన్ తీసుకోవాలి. 8.5 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మీరు నెలకు రూ.2569 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా మీరు 48 నెలలు కట్టాలి. అదే 36 నెలలకు అయితే రూ.3,200 ఈఎంఐ పడుతుంది. ఈ స్కూటర్ కొనుగోలు చేయడానికి లోన్ తీసుకోవాలని భావిస్తే.. మీ నెలవారీ నికర ఆదాయం కనీసం రూ.15,000 ఉండాలి. శాలరీ బ్యాంక్ అకౌంట్లో పడితే.. మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, శాలరీ స్లీప్ కావాలి. సిబిల్ స్కోర్ కచ్చితంగా 700కు పైనే ఉండాలి.