ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా అదిరిపోయే ఆఫర్‌తో కొనుగోలుదారుల ముందుకు వచ్చింది. యమహా స్కూటర్లపై మాత్రమే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫైనాన్స్‌లో స్కూటర్ కొనే వారికి చౌక వడ్డీకే రుణం అందుబాటులో ఉంది. రుణాలపై వడ్డీ రేటు 6.99 శాతం నుంచి ప్రారంభమౌతోంది. చౌక వడ్డీకే రుణాలు మాత్రమే కాకుండా మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. స్కూటర్ కొనుగోలుపై రూ.5000 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంటోంది. ఇకపోతే ఇది పరిమితి కాల ఆఫర్. అంటే ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది..